భారత వాణిజ్య నౌకల రక్షణకు యుద్ధనౌకలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:34 AM
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో భారత యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. సంక్షుభిత హోర్ముజ్ జలసంధి గుండా వస్తున్న...
న్యూఢిల్లీ, మార్చి 15: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో భారత యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. సంక్షుభిత హోర్ముజ్ జలసంధి గుండా వస్తున్న మర్చెంట్ షిప్(వాణిజ్యనౌక)ల రక్షణ కోసం పర్షియన్ గల్ఫ్ (పర్షియా సింధు శాఖ) సమీపాన ఇవి కాపు కాసి ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్‌లో 22 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయి. వీటిలో 6 ఎల్‌పీజీ, ఒకటి సీఎన్‌జీ, 4 క్రూడాయిల్ నౌకలు. సోమవారం నుంచి ఇందులో కొన్ని నౌకలకు ఇరాన్ దారిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భద్రతకు భారత్ పలు యుద్ధనౌకలను అక్కడ మోహరించింది. ఇరాన్, అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న ప్రాంతాన్ని పర్షియా సింధుశాఖ అని పిలుస్తారు. అరేబియా సముద్రంలోకి ఇది చొచ్చుకొని వచ్చినట్లుగా ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రాల్లో ఒకటి. ప్రధాన వాణిజ్య మార్గం కూడా.