ఇరాన్‌పై దాడులకు భారత నౌకాశ్రయాలా?
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:08 AM
ఇరాన్‌పై దాడులకు అమెరికా మన నేవల్ బేస్‌లను ఉపయోగించుకుంటోందంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది.
అవి నిరాధార వ్యాఖ్యలు.. నమ్మొద్దు
అమెరికా మాజీ సైనికాధికారి డగ్లస్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం
న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్‌పై దాడులకు అమెరికా మన నేవల్ బేస్‌లను ఉపయోగించుకుంటోందంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ‘వన్ అమెరికా న్యూస్ నెట్‌వర్క్’ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ సైనికాధికారి కర్నల్ డగ్లస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ సదుపాయాలన్నీ నాశనమయ్యాయి. మేం ఇప్పుడు భారతదేశ నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది ఎంతమాత్రం ఆదర్శనీయం కాదు. నేవీ కూడా ఇదే చెబుతోంది’’ అని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ విదేశాంగ శాఖ నిజనిర్ధారణ విభాగం గురువారం ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టింది. డగ్ల్‌సవి తప్పుడు వ్యాఖ్యలని.. అటువంటి నిరాధార, కల్పిత ఆరోపణలను నమ్మవద్దని అందులో పేర్కొంది.