Share News

అమెరికాలో ఆలయాల దాడులపై స్పందించరేం

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:22 AM

తమపై పదేపదే విమర్శలు చేయడాన్ని విరమించుకోవాలని అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌.....

అమెరికాలో ఆలయాల దాడులపై స్పందించరేం

న్యూఢిల్లీ, మార్చి 17: తమపై పదేపదే విమర్శలు చేయడాన్ని విరమించుకోవాలని అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌(యూఎస్సీఐఆర్‌ఎఫ్‌)ను భారత్‌ కోరింది. దాని బదులు అమెరికాలోని హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ‘వాస్తవాలకు భిన్నంగా సందేహాస్పద వర్గాలు, సైద్ధాంతిక కథనాలపై ఆధారపడి యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్‌ ఎన్నో ఏళ్లుగా భారతదేశం గురించి నిరంతరం ఏకపక్షంగా వక్రీకరించిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇలాంటివి పదేపదే చేయడం యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్‌ విశ్వసనీయతనే తగ్గిస్తుంది’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ స్పష్టం చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 04:22 AM