Share News

1000 కోట్ల యుద్ధ ముప్పు నిధి ఏర్పాటు!

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:55 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధి మూసివేయడంతో వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పశ్చిమాసియాలో...

1000 కోట్ల యుద్ధ ముప్పు నిధి ఏర్పాటు!

  • పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, మార్చి19: అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధి మూసివేయడంతో వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవడంతో హోర్ముజ్‌ వంటి ప్రమాదకర జలాల గుండా రాకపోకలు సాగించే నౌకలకు రక్షణ అందించే బీమా సంస్థలు భయపడుతున్నాయి. ఈ క్రమంలో బీమా సంస్థలకు అండగా నిలవాలని భారత్‌ భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లమేర యుద్ధ ముప్పు నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన.. బీమా లభ్యతలో పెరుగుతున్న అంతరాన్ని తగ్గించనుంది.

Updated Date - Mar 20 , 2026 | 04:55 AM