ఆహారం, ఎరువులు, ఇంధనంపై సబ్సిడీ 4.47 శాతం తగ్గింపు
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:11 AM
ఆహారం, ఎరువులు, ఇంధనంపై 2026-27లో ప్రభుత్వ వార్షిక సబ్సిడీ వ్యయం రూ.4,10,495 కోట్లు (మైనస్ 4.47శాతం)గా కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేశారు.
ఆహారం, ఎరువులు, ఇంధనంపై 2026-27లో ప్రభుత్వ వార్షిక సబ్సిడీ వ్యయం రూ.4,10,495 కోట్లు (మైనస్ 4.47ు)గా కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేశారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రంగాలపై సవరించిన సబ్సిడీ రూ.4,29,735 కోట్లు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీని రూ.2,27,629 కోట్లుగా అంచనా వేశారు. 2025-26లో సవరించిన అంచనా రూ.2,28,154 కోట్ల కంటే ఇది తక్కువ. ఎరువుల సబ్సిడీపైనా గతేడాది (రూ.1,86,460 కోట్లు)తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం (రూ.1,70,805 కోట్లు) తక్కువగానే అంచనా వేసింది. 2025-26లో పెట్రోలియం సబ్సిడీ రూ.15,121 కోట్లతో పోలిస్తే 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.12,085 కోట్లకు తగ్గించింది.