వచ్చే వారం ఇండియా కూటమి భేటీ
ABN , Publish Date - May 25 , 2026 | 03:59 AM
దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాన్ని రూపొందించేందుకు వచ్చే నెల మొదటి వారంలో ఇండియా కూటమి భేటీ కానుందని పశ్చిమ బెంగాల్ మాజీ ..
కోల్‌కతా, మే 24: దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాన్ని రూపొందించేందుకు వచ్చే నెల మొదటి వారంలో ఇండియా కూటమి భేటీ కానుందని పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమత ప్రకటించారు. సుదీర్ఘ పోరాటం చేసేందుకు ప్రతిపక్షాల కూటమి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం ఆమె ఫేస్‌బుక్ ద్వారా ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి బీజేపీ విజయం సాధించిందని మరోమారు ఆరోపించారు. తృణమూల్ 220-230 స్థానాల్లో గెలవాల్సి ఉండగా, బీజేపీ అక్రమాల కారణంగా 150 సీట్లను కోల్పోయినట్టు చెప్పారు. తృణమూల్ శ్రేణులను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. బెంగాల్‌లో వేధింపులు అధికమయితే దాని ప్రభావం ఢిల్లీలో పడుతుందని హెచ్చరించారు. 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తృణమూల్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని మమత ఆరోపించారు. మమత ఆరోపణలను బీజేపీ సీనియర్ నాయకుడు కేయా ఘోష్ ఖండించారు.