Share News

భారత స్పేస్‌ స్టేషన్‌ పనులు ప్రారంభం!

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:38 AM

అంతరిక్షంలో భారతదేశానికి సొంతంగా ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ఇస్రో కీలక ముందడుగు వేసింది.

భారత స్పేస్‌ స్టేషన్‌ పనులు ప్రారంభం!

  • సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో ముందడుగు

బెంగళూరు, జనవరి 24: అంతరిక్షంలో భారతదేశానికి సొంతంగా ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ఇస్రో కీలక ముందడుగు వేసింది. భారతీయ అంతరిక్ష స్టేషన్‌ (బీఏఎస్‌) నిర్మాణానికి సంబంధించి ఇస్రో ప్రాథమిక పనులను(గ్రౌండ్‌వర్క్‌) ప్రారంభించింది. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను నిర్మించడంలో సహకరించేందుకు ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎ్‌సఎ్‌ససీ) భారతీయ ఏరోస్పేస్‌ తయారీ కంపెనీలను ఆహ్వానించినట్లు తెలిసింది. మొదటి మాడ్యూల్‌ బీఏఎస్‌-01 నిర్మాణానికి సంబంధించి రెండు పూర్తి సెట్లను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను జారీచేసింది. 2035 నాటికి భారతీయులను నివాసయోగ్యమైన అంతరిక్ష ప్రయోగశాలకు పంపే దిశగా ఇది మొదటి అడుగుగా భావిస్తున్నారు. 2028లో ఈ మొదటి మాడ్యూల్‌ను భూకక్ష్యలోకి ప్రయోగించే అవకాశం ఉంది.

Updated Date - Jan 25 , 2026 | 02:38 AM