భారత్‌లో పాక్ కంటెంట్‌కు నో ఎంట్రీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:30 AM
పాకిస్థాన్‌లో రూపొందిన వెబ్ సిరీస్‌లను భారత్‌లో ప్రసారం చెయ్యొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది.
నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం స్పష్టమైన ఆదేశం
న్యూఢిల్లీ, నవంబరు 26: పాకిస్థాన్‌లో రూపొందిన వెబ్ సిరీస్‌లను భారత్‌లో ప్రసారం చెయ్యొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. పాకిస్థాన్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘జో బచే హైసంగ్ సమేట్ లో’ వెబ్‌సిరీస్ భారత్‌లో విడుదలయ్యే అవకాశాలపై పలు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. 2025 మే 8న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు జారీ చేసిన అడ్వైజరీని పాటిస్తూ... పాక్‌లో రూపొందిన కంటెంట్ భారత్‌లో అందుబాటులోకి తేవద్దని స్పష్టం చేసినట్లు తెలిపాయి. కాగా గతేడాది జూన్‌లోనూ పాకిస్థాన్‌లో రూపుదిద్దుకున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లను భారతీయ చందాదారులకు అందుబాటులో ఉంచడం లేదని నెట్‌ఫ్లిక్స్ మంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర సర్కారు కోరింది.