Share News

శ్రమతోనే భారత్‌-చైనా అభివృద్ధి

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:51 AM

కఠోర శ్రమ వల్లే భారత్‌, చైనా దేశాలు అభివృద్ధి సాధించాయి తప్ప.. ఇతర దేశాల దయ వల్ల కాదని చైనా రాయబారి షు ఫీహాంగ్‌ అన్నారు.

శ్రమతోనే భారత్‌-చైనా అభివృద్ధి

  • ఇతరుల దయతో కాదు: చైనా రాయబారి

న్యూఢిల్లీ, మార్చి 27: కఠోర శ్రమ వల్లే భారత్‌, చైనా దేశాలు అభివృద్ధి సాధించాయి తప్ప.. ఇతర దేశాల దయ వల్ల కాదని చైనా రాయబారి షు ఫీహాంగ్‌ అన్నారు. ఇటీవల చైనాను ఉద్దేశిస్తూ అమెరికా విదేశాంగ శాఖ ఉప కార్యదర్శి క్రిస్టోఫర్‌ లాండౌ అన్న మాటలకు ప్రతిస్పందనగా షు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో చైనా ఆర్థిక ఎదుగుదలకు అమెరికా సహకరించడం ఒక పొరపాటు అని, అటువంటి తప్పును భారత్‌ విషయంలో పునరావృతం చేయబోమని లాండౌ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ భారత్‌-చైనా యువజన చర్చల కార్యక్రమంలో చైనా రాయబారి మాట్లాడారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాల కోసం షు పిలుపునిచ్చారు.

Updated Date - Mar 28 , 2026 | 04:51 AM