భారత రక్షణ ఎగుమతులు రూ. 38,424 కోట్లు
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:06 AM
భారత రక్షణ ఎగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డును సృష్టించాయి. మొత్తం ఎగుమతులు రూ. 38,424 కోట్లకు చేరి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 62శాతం వృద్ధిని నమోదు చేశాయని....
2025-26లో రికార్డు స్థాయిలో 62 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: భారత రక్షణ ఎగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డును సృష్టించాయి. మొత్తం ఎగుమతులు రూ. 38,424 కోట్లకు చేరి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 62శాతం వృద్ధిని నమోదు చేశాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. గురువారం సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ.. రక్షణ ఎగుమతుల్లో వచ్చిన ఈ భారీ పెరుగుదల భారత రక్షణ సామర్థ్యాలపై ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రక్షణ ఎగుమతుల్లో భారత్ సరికొత్త విజయగాథను లిఖిస్తోందన్నారు. ఈ ఎగుమతుల్లో ప్రభుత్వరంగ రక్షణ సంస్థల వాటా 54.84 శాతం కాగా, ప్రైవేటు సంస్థల వాటా 45.16శాతం ఉంది. భారత్ ప్రస్తుతం 80 కంటే ఎక్కువ దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఎగుమతి సంస్థల సంఖ్య 128 నుంచి 145కు పెరిగింది. భారత రక్షణరంగ ఎగుమతులు 2024-25లో రూ.23,622 కోట్లున్నాయి.