Share News

ఇమ్రాన్‌ఖాన్‌.. 28లోగా దేశం విడిచి వెళ్లిపోండి

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:11 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌(43)ను (ఆమిర్‌ఖాన్‌ మేనల్లుడు) భారత్‌ విడిచి వెళ్లిపోవాలంటూ..

ఇమ్రాన్‌ఖాన్‌.. 28లోగా దేశం విడిచి వెళ్లిపోండి

  • విదేశీయుల ప్రాంతీయ నమోదు కేంద్రం నోటీసు

ముంబై, అక్టోబరు 15: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌(43)ను (ఆమిర్‌ఖాన్‌ మేనల్లుడు) భారత్‌ విడిచి వెళ్లిపోవాలంటూ.. విదేశీయుల ప్రాంతీయ నమోదు కేంద్రం (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) నోటీసు జారీ చేసింది. ఇందుకు అక్టోబరు 28 వరకు గడువు విధించింది. దీన్ని నిరంకుశ చర్యగా ప్రతిపక్షాలు విమర్శించగా, దీనిపై బాంబే హైకోర్టుకు వెళ్లాలని ఇమ్రాన్‌ఖాన్‌ నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. అలాగే, ఆయనకు ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డు కూడా ఉంది. భారతీయ మూలాలున్న విదేశీ పౌరులకు ఇచ్చే గుర్తింపు ఇది. అమెరికా పౌరుడైన ఆయన నిరసనల్లో పా ల్గొనడం ద్వారా ‘వలసదారులు, విదేశీయుల చట్టం’ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎఫ్‌ఆర్‌ఆర్‌వో ఈ చర్య తీసుకుంది. ఈనెల 10న ముంబైలోని ఆగస్ట్‌ క్రాంతి మైదానంలో జరిగిన సీఈసీ వ్యతిరేక నిరసనల్లో ఇమ్రాన్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, తర్వాత విడిచిపెట్టారు.

Updated Date - Oct 16 , 2026 | 06:13 AM