Share News

ఈ ఎండాకాలం ఎండలు ఎక్కువే

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:48 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని పలు ప్రాంతాలకు ఎండలు మండే కాలం ఎదురుకానుంది.

ఈ ఎండాకాలం ఎండలు ఎక్కువే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని పలు ప్రాంతాలకు ఎండలు మండే కాలం ఎదురుకానుంది. మార్చి-మే నెలల మధ్య ఈ ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం ప్రకటించింది. నెలవారీ వాతావరణ వివరాలను విడుదల చేసిన ఆ శాఖ రానున్నది కష్టకాలమేనని తెలిపింది. ‘‘మార్చి-ఏప్రిల్‌- మే (ఎంఏఎం) సీజన్‌లో వేడి గాలులు అధికంగా ఉంటాయి. ప్రజారోగ్యం, విద్యుత్తు, నీటి వనరులపై దీని ప్రభావం ఉంటంది. ఎండల్లో పని చేసేవారు, పిల్లలు, వృద్ధులు, రోగగ్రస్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగానే ఉంటాయని అన్నారు. మార్చిలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురవనుండడంతో వాతావరణం చల్లబడుతుందని తెలిపారు.

Updated Date - Mar 01 , 2026 | 03:48 AM