Share News

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ వైద్య కోర్సులు

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:57 AM

భారత ఉన్నత విద్య, ఆరోగ్య రంగాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్‌ (ఎండీ) మెడికల్‌ కోర్సులను ప్రవేశపెట్టిన తొలి ఐఐటీగా ఖరగ్‌పూర్‌-ఐఐటీ నిలిచింది.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ వైద్య కోర్సులు

  • దేశంలోనే పీజీ మెడికల్‌ విద్యను ప్రవేశపెట్టిన తొలి ఐఐటీగా రికార్డు

న్యూఢిల్లీ, నవంబరు 12: భారత ఉన్నత విద్య, ఆరోగ్య రంగాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్‌ (ఎండీ) మెడికల్‌ కోర్సులను ప్రవేశపెట్టిన తొలి ఐఐటీగా ఖరగ్‌పూర్‌-ఐఐటీ నిలిచింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభించేందుకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) ఆమోదం లభించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ బీసీ రాయ్‌ మల్టీ స్పెషాలిటీ మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో మొత్తం 12 సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎండీ జనరల్‌ మెడిసి న్‌, రేడియాలజీ, ఫిజియాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఒక్కో స్పెషలైజేషన్‌లో రెండు సీట్లు చొప్పున కేటాయించారు. నీట్‌ పీజీ-2026 ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు ఈ 12 సీట్లు అందుబాటులో ఉంటాయి. పీజీ మెడికల్‌ విద్యలో ఐఐటీ వ్యవస్థను విస్తరించడంతో పాటు సాంప్రదాయ వైద్యవిద్యకు ఇంజనీరింగ్‌, కృత్రి మ మేధ (ఏఐ), బయో మెడికల్‌ సైన్సెస్‌ పరిశోధనలను అనుసంధానించడమే ఈ నిర్ణయం కీలక ఉద్దే శం. ఇది వైద్యులు కేవలం చికిత్సకే పరిమితం కాకుం డా.. భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను టెక్నాలజీ, శాస్త్రీయ పరిశోధనలు ఏ విధంగా పరిష్కరించగలవో అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. 1951లో దేశంలోనే మొదటి ఐఐటీగా ప్రారంభించిన ఐఐటీ.. ఇప్పుడు పీజీ మెడికల్‌ కోర్సులను ప్రవేశపెట్టి న దేశంలోనే తొలి ఐఐటీగానూ నిలవడం గమనార్హం.

Updated Date - Nov 13 , 2026 | 02:59 AM