Share News

‘నేను కుల దూషణకు పాల్పడలేదు’

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:04 AM

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వాకొడే(22) ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ విద్యా సంస్థ ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దూళ్ల శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు.

‘నేను కుల దూషణకు పాల్పడలేదు’

  • పోలీసు విచారణలో ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ సూర్యనారాయణ

ముంబై, అక్టోబరు 2 : ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వాకొడే(22) ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ విద్యా సంస్థ ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దూళ్ల శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దాదాపు 8గంటల పాటు చేసిన విచారణలో తనపై వచ్చిన ఆరోపణలను సూర్యనారాయణ తిరస్కరించారని తెలిసింది. తాను ఏ విద్యార్థిని దూషించలేదని, కుల వివక్షకు పాల్పడలేదని సూర్యనారాయణ పోలీసులకు వెల్లడించారని సమాచారం. సెప్టెంబరు 18న పరీక్ష హాల్‌లో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించి అధ్యాపకులకు పట్టుబడిన సాహిల్‌.. ఆ తర్వాత కాసేపటికే హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ప్రొఫెసర్‌ సూర్యానారాయణ కులం పేరుతో దూషించడం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ సాహిల్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Oct 03 , 2026 | 03:05 AM