Share News

దివాలా చట్టంతో బ్యాంకింగ్‌ బలోపేతం: నిర్మల

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:54 AM

దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడంలో దివాలా చట్టం (ఐబీసీ) కీలక పాత్ర పోషించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా..

దివాలా చట్టంతో బ్యాంకింగ్‌ బలోపేతం: నిర్మల

న్యూఢిల్లీ, మార్చి 30: దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడంలో దివాలా చట్టం (ఐబీసీ) కీలక పాత్ర పోషించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సగానికి పైగా మొండి బకాయిల (ఎన్‌పీఏ)ను బ్యాంకులు వసూలు చేయడంలో వసూళ్లలోనూ కీలక పాత్ర వహించిందన్నారు. ఐబీసీ సవరణ బిల్లు, 2025పై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఆమె ఈ విషయం చెప్పారు. సుదీర్ఘ చర్చ తర్వాత 12 సవరణలతో కూడిన ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Updated Date - Mar 31 , 2026 | 04:54 AM