Share News

గురువుతో కలిసి చివరి గగనయానం

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:28 AM

భారత వైమానిక దళ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తరుణంలో తనకు శిక్షణనిచ్చిన గురువుతో కలిసి మంగళవారం చివరిసారిగా విమానాన్ని నడిపారు.

గురువుతో కలిసి చివరి గగనయానం

అల్వాల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): భారత వైమానిక దళ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తరుణంలో తనకు శిక్షణనిచ్చిన గురువుతో కలిసి మంగళవారం చివరిసారిగా విమానాన్ని నడిపారు. వైమానిక దళంలో తరతరాల పైలట్లకు శిక్షణ నిచ్చిన ‘కిరణ్‌’ శిక్షణ విమానంలో తన మొదటి ప్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ వింగ్‌ కమాండర్‌ వీఎస్‌ కోచర్‌ (రిటైర్డ్‌)తో కలిసి 55 నిమిషాలపాటు ప్రయాణించారు. హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో 1984లో ఏపీ సింగ్‌ తన శిక్షణను ప్రారంభించారు. ఆ ఏడాది జనవరి 28న తొలిసారిగా విమానాన్ని నడిపారు. కెరీర్‌ ఆరంభంలో దిశానిర్దేశం చేసిన గురువు కోచర్‌ సమక్షంలోనే తన విమానయానానికి ముగింపు పలకడం ద్వారా వైమానిక దళంలో గురుశిష్యుల అనుబంధం, శిక్షకుల పాత్ర ఎంత బలమైనదో ఏపీ సింగ్‌ మరోసారి చాటి చెప్పారు.

Updated Date - Oct 22 , 2026 | 04:30 AM