దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:54 AM
దేశంలో ఇళ్ల విక్రయాలపై మందగమనం కొనసాగుతోంది. 2026 సంవత్సరంలో ఇళ్ల కొనుగోళ్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని, విలాసవంతమైన గృహాల అమ్మకాలు కూడా నెమ్మదించబోతున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా తన తాజా నివేదిక పేర్కొంది.
కొనుగోలు శక్తి తగ్గడమే కారణం: నువామా నివేదిక
న్యూఢిల్లీ, అక్టోబరు 27: దేశంలో ఇళ్ల విక్రయాలపై మందగమనం కొనసాగుతోంది. 2026 సంవత్సరంలో ఇళ్ల కొనుగోళ్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని, విలాసవంతమైన గృహాల అమ్మకాలు కూడా నెమ్మదించబోతున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా తన తాజా నివేదిక పేర్కొంది. ఇళ్ల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోవడం, మధ్యతరగతి వారికి తగ్గట్టుగా సరసమైన ధరలకు ఇళ్లు అందుబాటులో లేకపోవడం, కొత్త ఉద్యోగాల కల్పన మందగించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని స్పష్టం చేసింది. నువామా నివేదిక ప్రకారం.. 2026 సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 3శాతం కిందటి నెలతో పోలిస్తే 17శాతం మేర పడిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, ముంబైలలో చెరో 24శాతం చొప్పున విక్రయాలు పడిపోగా, చెన్నైలో 16శాతం, పుణేలో 9శాతం మేర క్షీణత నమోదైంది. బెంగళూరు, ఎన్‌సీఆర్ నగరాల్లో మాత్రం అమ్మకాలు మూడు నుంచి ఆరు శాతం వృద్ధిని కనబరిచాయి.