గ్యాస్ కొరతపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:47 AM
దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయంపై హోటల్, రెస్టారెంట్ పరిశ్రమల...
గ్యాస్ కొరతపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మార్చి 9: దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయంపై హోటల్, రెస్టారెంట్ పరిశ్రమల సంఘం (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన లేఖలో, క్షేత్రస్థాయిలో డిస్ట్రిబ్యూటర్లు సరఫరాను నిలిపివేయడం వల్ల హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వివరించింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సాకుగా చూపుతూ సిలిండర్ల పంపిణీని అడ్డుకుంటున్నారని, దీనివల్ల రెస్టారెంట్ల నిర్వహణ కష్టతరంగా మారుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో, హోటల్, ఆహార సేవల రంగాలకు ఎటువంటి ఆంక్షలు వర్తించవని ప్రభుత్వం వెంటనే ఒక అధికారిక స్పష్టత ఇవ్వాలని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ సెక్రటరీ జనరల్ కోరారు.