Dog Bite Medicines: కుక్కకాటు మందులు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:02 AM
కుక్కకాటు నివారణ మందులు ఎల్లవేళలా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులను జాతీయ వైద్య కమిషన్...
అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు ఆదేశాలు
న్యూఢిల్లీ, జనవరి 1: కుక్కకాటు నివారణ మందులు ఎల్లవేళలా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆదేశించింది. వీటిని అందుబాటులో ఉంచడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. యాంటీ రాబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ), రాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఆర్‌ఐజీ) మందుల స్టాక్ ఉండేలా చూడాలని పేర్కొంది. వీధి కుక్కల బెడద నివారణకు నవంబరు ఏడో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన సూచనలు చేసింది. నాలుగు వారాల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించాలని ఎన్‌ఎంసీ సూచించింది.