భారత న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం
ABN , Publish Date - May 25 , 2026 | 04:26 AM
భారత న్యాయవ్యవస్థలో త్వరలో తొలిసారి అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకే సమయంలో దేశంలోని నాలుగు హైకోర్టులకు మహిళా ప్రధాన న్యాయమూర్తులు నేతృత్వం వహించనున్నారు.
త్వరలో ఒకే సమయంలో 4 హైకోర్టులకు మహిళా సీజేలు
న్యూఢిల్లీ, మే 24: భారత న్యాయవ్యవస్థలో త్వరలో తొలిసారి అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకే సమయంలో దేశంలోని నాలుగు హైకోర్టులకు మహిళా ప్రధాన న్యాయమూర్తులు నేతృత్వం వహించనున్నారు. ప్రస్తుతం గుజరాత్, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ రేవతి మోహితె డెరె, జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మీనాక్షి ఎం రాయ్‌ను నియమించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. పట్నా హైకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంగమ్ కుమార్ సాహు జూన్ 4న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ రాయ్‌ను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం ఈ నెల 22న ఆమోదం తెలిపింది. జస్టిస్ రాయ్ నియామకంతో ఒకే సమయంలో హైకోర్టులలో నలుగురు మహిళా ప్రధాన న్యాయమూర్తులు విధులు నిర్వహించనున్నారు.