Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:04 AM
పై చిత్రంలో కనిపిస్తున్న చిన్నపాటి విమానం.. ఓ ప్రైవేట్ విమానయాన సంస్థది. తొమ్మిది మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న......
ఆరుగురికి గాయాలు.. ఒడిశాలోని రూర్కెలాలో ఘటన
రూర్కెలా/భవనేశ్వర్, జనవరి 10: పై చిత్రంలో కనిపిస్తున్న చిన్నపాటి విమానం.. ఓ ప్రైవేట్ విమానయాన సంస్థది. తొమ్మిది మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ‘వన్ ఏ-1’ చార్టర్డ్ విమానం.. శనివారం నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు బయలు దేరింది. మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుతుందనగా.. అదుపుతప్పి పొలాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్లు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు ఒడిశా రవాణాశాఖ మంత్రి బీబీ జెనా తెలిపారు.