Share News

మాజీ ఉపరాష్ట్రపతి బంధువులమని.. నిరుద్యోగులకు టోకరా!

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:28 AM

ఆ ఆరెస్సెస్‌ సీనియర్‌ నాయకుడు మా అన్నయ్య.. మాజీ ఉపరాష్ట్రపతి మా మామయ్య.. అంతా మన చేతిలో పనే అంటూ.. హరియాణాలోని నిరుద్యోగులను నమ్మించి రూ.2.41 కోట్లు వసూలు చేసిన..

మాజీ ఉపరాష్ట్రపతి బంధువులమని.. నిరుద్యోగులకు టోకరా!

  • హరియాణాలో మోసం.. 2.4కోట్లు వసూలు

న్యూఢిల్లీ, అక్టోబరు 18 : ఆ ఆరెస్సెస్‌ సీనియర్‌ నాయకుడు మా అన్నయ్య.. మాజీ ఉపరాష్ట్రపతి మా మామయ్య.. అంతా మన చేతిలో పనే అంటూ.. హరియాణాలోని నిరుద్యోగులను నమ్మించి రూ.2.41 కోట్లు వసూలు చేసిన ఐదుగురిపై సీబీఐ కేసు నమోదైంది. హరియాణాలోని పానిపట్‌కు చెందిన వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు క్రిషన్‌, కపిల్‌, సునీల్‌, రాజేందర్‌ బైరాగి, హర్పల్‌ పునియాపై కేసు నమోదైంది. నిందితులంతా ఓ సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వ ఉద్యోగాల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించారు. ఎఫ్‌సీఐలో సూపర్‌వైజర్‌ ఉద్యోగానికి రూ.14లక్షలు, క్లర్క్‌ ఉద్యోగానికి రూ.12లక్షలు, బంట్రోతు ఉద్యోగానికి రూ.8లక్షలు ధర పెట్టి వసూళ్లు చేశారు. వారిని నమ్మించేందుకు పరీక్షలు పెట్టి, ఎఫ్‌సీఐ గోదాములో మూడు నెలల శిక్షణ కూడా ఇచ్చారు. ఇలా వీరిలో చేతిలో 12 మంది మోసపోగా వారి నుంచి రూ.2.41 కోట్లు దాకా వసూలు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - Oct 19 , 2026 | 06:28 AM