Share News

హెయిర్‌ స్టైల్‌ చెడగొడితే 2 కోట్ల పరిహారమా!

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:25 AM

ఎంత పెద్ద మోడల్‌ అయినా హెయిర్‌ స్టయిల్‌ విలువ రూ.2 కోట్లు ఉంటుందా! హెయిర్‌ కటింగ్‌ చేసినవారు దానిని చెడగొట్టారంటూ అంత పెద్దమొత్తంలో నష్టపరిహారం కోరవచ్చా! ఆష్నారాయ్‌ అనే మోడల్‌ రూ.2 కోట్ల పరిహారం కోరారు.

హెయిర్‌ స్టైల్‌ చెడగొడితే 2 కోట్ల పరిహారమా!

  • 25 లక్షలు చాలంటూ ఏడేళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఎంత పెద్ద మోడల్‌ అయినా హెయిర్‌ స్టయిల్‌ విలువ రూ.2 కోట్లు ఉంటుందా! హెయిర్‌ కటింగ్‌ చేసినవారు దానిని చెడగొట్టారంటూ అంత పెద్దమొత్తంలో నష్టపరిహారం కోరవచ్చా! ఆష్నారాయ్‌ అనే మోడల్‌ రూ.2 కోట్ల పరిహారం కోరారు. ఏడేళ్ల క్రితం నాటి ఈ కేసులో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కారాల కమిషన్‌(ఎన్‌సీడీఆర్‌సీ) కూడా అంతమొత్తం చెల్లించాల్సిందేనంటూ ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పును తప్పుబడుతూ పరిహారాన్ని రూ.25 లక్షలకు కుదించింది. 2018లో ఆష్నారాయ్‌.. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ఉన్న సెలూన్‌కు వెళ్లి హెయిర్‌ కటింగ్‌ చేసుకున్నారు. అయితే, ఆ సెలూన్‌ వారు నిర్లక్ష్యంగా చేసిన పనివల్ల తన లుక్‌ పూర్తిగా మారిపోయి, గ్లామర్‌ చెడిపోయి.. తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని, ఇది మోడలింగ్‌లో, సినిమాల్లో అవకాశాలపైనా ప్రభావం చూపించిందని, తనకు జరిగిన నష్టానికి పరిహారం కింద రూ.2 కోట్లు ఇప్పించాలని కోరారు. ఎన్‌సీడీఆర్‌సీ కూడా ఆమెకు అనుకూలంగా తీర్పునివ్వగా.. ఐటీసీ మౌర్య హోటల్‌ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. .

Updated Date - Feb 10 , 2026 | 03:25 AM