హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:31 AM
హెచ్-1 బీ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) గురువారం వీసా రిజిస్ట్రేషన్ల పోర్టల్‌ను అందుబాటులో....
న్యూఢిల్లీ, మార్చి 6: హెచ్-1 బీ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) గురువారం వీసా రిజిస్ట్రేషన్ల పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. మార్చి 19 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. హెచ్-1బీ వీసా నూతన నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత తొలిసారిగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కంపెనీలు అమెరికా బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటున్న నిపుణుల దరఖాస్తు, ఎంపికైతే లక్ష డాలర్లు చెల్లించాలన్నది తొలి నూతన నిబంధన. అలాగే లాటరీ పద్ధతిలోనూ మార్పులు తెచ్చారు. ఎక్కువ జీతం తీసుకునే నిపుణులకు లాటరీలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇది ప్రధానంగా కన్సల్టెంట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తే... సీనియర్ పొజిషన్లలోకి వృత్తి నిపుణులను తీసుకునే కంపెనీలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కూ 215 డాలర్లను కంపెనీలు చెల్లించాలి. హెచ్-1బీ వీసాలకు తీవ్రమైన పోటీ ఉంది. ఏడాదికి కేవలం 85,000 వీసాలు మాత్రమే జారీ అవుతాయి. 20 వేల వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి కేటాయిస్తారు.