జంతర్‌మంతర్‌లో10న సీజేపీ ఆందోళన
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:35 AM
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఈ నెల 10న సీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ఉంటుందని అభిజీత్ దీప్కే ప్రకటించారు.
సీజేపీ నేత అభిజీత్ దీప్కే వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 3: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఈ నెల 10న సీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ఉంటుందని అభిజీత్ దీప్కే ప్రకటించారు. ఈ ఆందోళనకు ముందే ప్రభుత్వం తన వ్యక్తిగత ‘ఎక్స్’ ఖాతాను పూర్తిగా తొలగించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన అన్నారు. సీజేపీ ఉద్యమానికి పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మద్దతు పలకడం, అందుకు దీప్కే కృతజ్ఞతలు తెలిపిన పోస్టును ఎక్స్‌లో తొలగించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ సమీపంలో శనివారం కూడా భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. శనివారం పటేల్ చౌక్ నుంచి జంతర్‌మంతర్ వద్దకు ర్యాలీగా వస్తున్న ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, సామాజిక కార్యకర్త యోగేంద్రయాదవ్, సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 150మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు.