Share News

జ్ఞానేశ్‌ బహిరంగ అభిశంసన!

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:25 AM

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై పోరును ఇండీ కూటమి తీవ్రతరం చేసింది.

జ్ఞానేశ్‌ బహిరంగ అభిశంసన!

  • ఖర్గే నివాసంలో నేడు మాక్‌ పార్లమెంటు

న్యూఢిల్లీ, అక్టోబరు 29: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై పోరును ఇండీ కూటమి తీవ్రతరం చేసింది. ఆయన్ను బహిరంగంగా అభిశంసించేందుకు శుక్రవారం మాక్‌ పార్లమెంటు నిర్వహించనుంది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాంధీ వాద్రా, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌, టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియన్‌, ఎస్‌పీ నాయకుడు హరేంద్ర మాలిక్‌, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, సీపీఎం ఎంపీ జాన్‌ బిట్రాస్‌ తదితరులు భేటీ అయ్యా రు. మాక్‌ పార్లమెంటు ఎలా నిర్వహించాలో ఖరారు చేశారు. ఖర్గే నివాసంలోనే మీరాకుమార్‌ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. జ్ఞానేశ్‌కుమార్‌పై బహిరంగ అభిశంసన తీర్మానాన్ని ఖర్గే ప్రవేశపెడతారు.

Updated Date - Oct 30 , 2026 | 02:27 AM