స్నేహితుల మధ్య వాగ్వాదం..రెండు కార్లతో బీభత్సం
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:35 AM
ఇద్దరు స్నేహితులు తమ ఎస్‌యూవీ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ నడిరోడ్డుపై విధ్వంసం సృష్టించారు. హరియాణా గురుగ్రామ్‌లోని ధన్వాపుర్ గ్రామంలో ..
గురుగ్రామ్, ఏప్రిల్ 6: ఇద్దరు స్నేహితులు తమ ఎస్‌యూవీ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ నడిరోడ్డుపై విధ్వంసం సృష్టించారు. హరియాణా గురుగ్రామ్‌లోని ధన్వాపుర్ గ్రామంలో జరిగిన ఈ ఘనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వారు తమ ఎస్‌యూవీ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. సినిమా ఫైట్లను తలిపించేలా ఒక కారును మరో కారు బలంగా ఢీకొట్టడం, ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.