Share News

డేరా బాబాకు 16వ సారి పెరోల్‌

ABN , Publish Date - May 27 , 2026 | 03:56 AM

శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌కు మరోసారి పెరోల్‌ మంజూరయింది.

డేరా బాబాకు 16వ సారి పెరోల్‌

చండీగఢ్‌, మే 26: శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌కు మరోసారి పెరోల్‌ మంజూరయింది. ఈ సారి 30 రోజుల పాటు జైలు బయట ఉండనున్నారు. మంగళవారం ఉదయం 6.35గంటలకు ఆయన హరియాణాలోని రోహ్‌తక్‌లో ఉన్న సునారియా జైలు నుంచి భారీ బందోబస్తు నడుమ బయటకు వచ్చారు. ఇద్దరు శిష్యురాళ్లను రేప్‌ చేశారన్న కేసులో ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2017లో జైలుకు వెళ్లగా పెరోల్‌పై విడుదల కావడం ఇది 16వ సారి. ఈ ఏడాది జనవరిలో 40 రోజుల పెరోల్‌ మంజూరయింది. ఏడాదిలో మొత్తం పది వారాల పాటు రెండుసార్లు మాత్రమే పెరోల్‌ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉండడంతో 2026కు ఇదే చివరిదయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో మూడు వారాల పాటు ఫర్లో కింద ప్రత్యేక సెలవు తీసుకునే వీలుంది.

Updated Date - May 27 , 2026 | 03:56 AM