Share News

హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి!

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:14 AM

అమెరికా-ఇరాన్‌ యుద్ధం.. కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తన నియంత్రణలోకి తీసుకోవడం.. చమురు, గ్యాస్‌ రవాణాకు తీవ్ర ఇబ్బందులు నెలకొనడంతో గల్ఫ్‌ దేశాలు ప్రత్యామ్నాయ...

హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి!

  • పైప్‌లైన్ల ద్వారా చమురు ఎగుమతులపై గల్ఫ్‌ దేశాల సమాలోచనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: అమెరికా-ఇరాన్‌ యుద్ధం.. కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తన నియంత్రణలోకి తీసుకోవడం.. చమురు, గ్యాస్‌ రవాణాకు తీవ్ర ఇబ్బందులు నెలకొనడంతో గల్ఫ్‌ దేశాలు ప్రత్యామ్నాయ మా ర్గాలపై దృష్టి పెట్టాయి. ఎలాంటి అవాంతారాల్లేకుండా చమురు, గ్యాస్‌ ఎగుమతులు చేసేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నాయి. హోర్ముజ్‌ అవసరం లేని ఖరీదైన పైప్‌లైన్‌ ప్రాజెక్టులను మళ్లీ పరిశీలిస్తున్నట్లు స మాచారం. 1980ల్లో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం సమయంలో సౌదీ అరేబియా 1200 కిలోమీటర్ల మేర ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ను నిర్మించింది. ఆ పైప్‌లైన్‌ ఇప్పటికీ కీలకంగా ఉంది. దీంతో రోజుకు 70 లక్షల బ్యారెళ్ల చమురును ఎర్రసముద్రం తీరంలోని యన్బు పోర్ట్‌కు తరలిస్తున్నారు. ఈ పైప్‌లైన్‌ తమకు ప్రధాన ఎగుమతి మార్గమని సౌదీ ఆరామ్‌కో సీఈవో అమిన్‌ నాజర్‌ తెలిపారు. భవిష్యత్తులో ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ సామర్థ్యాన్ని పెంచ డం లేదా కొత్త పైప్‌లైన్‌ నిర్మించే అంశాలను సౌదీ ప్ర భుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాల మీదుగా యూర్‌పకు వెళ్లే ఐఎంఈసీ వాణిజ్య కారిడార్‌ ప్రతిపాదన కూడా చర్చల్లో ఉంది. అయితే కొత్త పైప్‌లైన్‌ నిర్మాణానికి భారీ ఖర్చు, భద్రతా సమస్యలు పెను సవాళ్లుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్ల సామర్థ్యాన్ని పెంచ డం, ఎర్రసముద్రం తీరంలో కొత్త ఎగుమతి పోర్టులు అభివృద్ధి చేయడం వంటి తాత్కాలిక చర్యలపై గల్ఫ్‌ దేశాలు దృష్టి పెట్టాయి.

Updated Date - Apr 03 , 2026 | 04:14 AM