తనను తాను బంధించుకొని.. వ్యక్తి కిడ్నాప్ డ్రామా!
ABN , Publish Date - Jun 22 , 2026 | 03:56 AM
అప్పు ఇచ్చినోళ్లు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నారు.. ఆ అప్పేమో లక్షల్లో ఉంది.. మరి, ఎలా తీర్చడం? బాగా ఆలోచించి.. సినిమా రేంజ్‌లో స్కెచ్ వేశాడా వ్యక్తి! తాను కిడ్నాప్ ...
ఆ వీడియో భార్యకు పంపి రూ.50 లక్షల ఇస్తేనే వదిలేస్తారని నమ్మించే యత్నం.. నోరెళ్లబెట్టిన పోలీసులు
సూరత్, జూన్ 21: అప్పు ఇచ్చినోళ్లు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నారు.. ఆ అప్పేమో లక్షల్లో ఉంది.. మరి, ఎలా తీర్చడం? బాగా ఆలోచించి.. సినిమా రేంజ్‌లో స్కెచ్ వేశాడా వ్యక్తి! తాను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడాడు. తనను తాను బంధించుకొని, ఆ వీడియోను కుటుంబసభ్యులకు పంపి రూ.50 లక్షలు పంపితే కిడ్నాపర్లు తనను వదిలేస్తారని సెంటిమెంట్ పండించాడు! గుజరాత్‌కు చెందిన జిగ్నేశ్ అనే ఓ అకౌంటెండ్ ఆడిన డ్రామా ఇది! షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి.. నష్టాలు రావడంతో జిగ్నేశ్ అప్పులపాలయ్యాడు. గోద్రాలోని ఓ హోటల్‌లో గదిని బుక్ చేసుకొని.. తనకు తానుగా నోట్లో గుడ్డలు కుక్కుకొని, కాళ్లు చేతులు కట్టేసుకొని, వీడియోను రికార్డు చేసి భార్యకు పంపాడు. ఆందోళనకు గురైన ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలతో హోటల్ గదికి వెళ్లి జిగ్నేశ్‌ను రక్షించారు. అయితే అతడే కిడ్నాప్ డ్రామా ఆడాడని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ.. జిగ్నేశ్ నోట్లో గుడ్డలు కుక్కుకొని, చేతులు, కాళ్లు కట్టేసుకొని.. వీడియో ఎలా తీయగలిగాడు? దీన్నే తేల్చేపనిలో పడ్డారు పోలీసులు.