Share News

యూపీఐ లావాదేవీల్లో చిరు వ్యాపారులకు ఊరట?

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:37 AM

చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. యూపీఐ లావాదేవీలపై విధించే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)పై జీఎస్టీ మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

యూపీఐ లావాదేవీల్లో   చిరు వ్యాపారులకు ఊరట?
UPI

7న జీఎస్టీ మండలి భేటీలో కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. యూపీఐ లావాదేవీలపై విధించే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)పై జీఎస్టీ మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై అక్టోబరు 15 నుంచి 0.4 శాతం ఎండీఆర్‌ వసూలు చేయనున్నారు. దీనిపై అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా పడుతుంది. అయితే, ఈ నిర్ణయం చిన్న వ్యాపారులకు గుదిబండగా మారనుంది. జీఎస్టీ పరిధిలో నమోదైన పెద్ద వ్యాపారులు ఈ 18ు ట్యాక్స్‌ను ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ (ఐటీసీ) ద్వారా తిరిగి పొందే వీలుంటుంది. కానీ, జీఎస్టీ కింద నమోదు కాని చిరు వ్యాపారులకు ఆ అవకాశం లేదు. దీనివల్ల లావాదేవీల పన్ను భారం మొత్తాన్ని వారే భరించాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన కేంద్రం, చిన్న వ్యాపారులపై భారం పడకుండా చూడాలని యోచిస్తోంది. వారికి పన్ను మినహాయింపుపై అక్టోబరు 7న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Sep 22 , 2026 | 04:46 AM