గ్రేట్ నికోబార్‌లో 13వేల కోట్లతో ఎయిర్‌పోర్టు
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:58 AM
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.13 వేల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పౌర-మిలిటరీ..
న్యూఢిల్లీ, జూన్ 9: గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.13 వేల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పౌర-మిలిటరీ ఎయిర్‌పోర్టుగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. తొలుత ఐఎన్‌ఎస్ బాజ్ ఎయిర్‌పోర్టును విస్తరించాలని భావించినా, దాని స్థానంలో ఈ కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికే మొగ్గు చూపారు. గ్రేట్ నికోబార్ ఆగ్నేయ తీరంలోని గలాథియా అఖాతానికి సమీపంలో ఉన్న చింగెన్ వద్ద ఈ కొత్త ద్వంద్వ-వినియోగ ఎయిర్‌పోర్టును నిర్మిస్తారని ప్రభుత్వ, రక్షణ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేవీ నిర్వహణలో ఉండే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పౌర విమానయాన సేవలను కూడా అందిస్తుంది. ప్రపంచ మారిటైమ్ వాణిజ్యంలో అత్యంత రద్దీగా ఉండే వాటిల్లో ఒకటైన మలక్కా జలసంధికి సమీపంలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడం వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనదని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న క్యాంప్‌బెల్ బేలోని ఐఎన్‌ఎస్ బాజ్ ఎయిర్‌పోర్టు విస్తరణ ప్రణాళికను పక్కనబెట్టినట్లు అయింది.