Share News

కర్ణాటకలోనూ.. గవర్నర్‌ వర్సెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:34 AM

తమిళనాడు, కేరళ తరహాలో కర్ణాటకలోనూ గవర్నర్‌, రాష్ట్రప్రభుత్వం మధ్య వివాదం తలెత్తింది. గురువారం అసెంబ్లీ ఉభయసభలనుద్దేశించి తాను చేయాల్సిన....

కర్ణాటకలోనూ.. గవర్నర్‌ వర్సెస్‌ ప్రభుత్వం

  • నేటి అసెంబ్లీ సమావేశాలకు రానన్న గెహ్లాట్‌

  • ప్రసంగ పాఠంలో 11 పేరాలు తొలగించాలని షరతు

బెంగళూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు, కేరళ తరహాలో కర్ణాటకలోనూ గవర్నర్‌, రాష్ట్రప్రభుత్వం మధ్య వివాదం తలెత్తింది. గురువారం అసెంబ్లీ ఉభయసభలనుద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగంలోని 11 పేరాలను తొలగిస్తేనే ప్రత్యేక సమావేశాలకు వచ్చి ప్రసంగిస్తానని గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ షరతు విధించారు. ఇందుకు సీఎం సిద్దరామయ్య ససేమిరా అన్నారు. గెహ్లాట్‌ సభకు రాకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును, విధానాలను మార్చడం.. దీనిపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన చేపట్టడం తెలిసిందే. ఉపాధి పథకాన్ని ‘వీబీ:జీరామ్‌జీ’గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సభలో దీనిపై చర్చించి, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా తీర్మానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు సమాచారం ఇచ్చారు. చదవాల్సిన ప్రసంగ పాఠాన్ని ముందుగానే పంపించారు. అయితే తాను అసెంబ్లీకి రావడం లేదంటూ బుధవారం సాయంత్రం ఆయన నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు.

Updated Date - Jan 22 , 2026 | 03:34 AM