20 నుంచి పార్లమెంటు సమావేశాలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:51 AM
పార్లమెంటు వర్ష్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 13 వరకు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.
న్యూఢిలీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వర్ష్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 13 వరకు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు అరెస్టయి 30 రోజులకుపైగా జైల్లో ఉంటే పదవుల నుంచి వైదొలగాలన్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు జమిలీ ఎన్నికల బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కమిటీ సమర్పించిన నివేదికను ఈ సమావేశాల్లోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. శనివారం కోల్‌కతాలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.