ప్రభుత్వ ఆఫీసుల్లో స్క్రాప్ వేలంతో ఐదేళ్లలో కేంద్రానికి 5వేల కోట్ల ఆదాయం
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:45 AM
గడిచిన ఐదేళ్లలో(2021-26) కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన వ్యర్థాలు, పాత సామగ్రిస్క్రాప్) వేలం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.5,103కోట్ల ఆదాయం వచ్చినట్లు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: గడిచిన ఐదేళ్లలో(2021-26) కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన వ్యర్థాలు, పాత సామగ్రి(స్క్రాప్) వేలం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.5,103కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన ప్రత్యేక క్యాంపెయిన్ ‘స్వచ్ఛత’లో భాగంగా నిరుపయోగంగా మారిన పాత కంప్యూటర్లు, ఇతర ఎలకా్ట్రనిక్ వ్యర్థాలు, పాత వాహనాలు, ఫర్నిచర్‌ను వేలం వేయడం ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఇందులో భాగంగా పాత దస్త్రాలను కూడా డిజిటలైజ్ చేసి, అనవసరమైన ఫైళ్లను తొలగించి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాన్ని పెంచారు. ఈ ఐదేళ్లలో ఏడాదికోసారి చొప్పున స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 24.20లక్షల ఆఫీసుల్లో 180.48లక్షల పాత ఫైళ్లను తొలగించారు. ఒక్క గతేడాదిలోనే 11.6లక్షల ఆఫీసుల్లో దాదాపు 30లక్షల ఫైళ్లను తొలగించారు. దీంతో, 2025లో కేంద్రానికి రూ.833కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, ఈ స్వచ్ఛత కార్యక్రమం ఆరో ఎడిషన్ అక్టోబరు 2 నుంచి అక్టోబరు 31వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీలోగా స్ర్కాప్‌ను గుర్తించాలని కేంద్రప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు సూచించింది.