Share News

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా 70 శాతం పెంపు

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:30 AM

రాష్ట్రాలకు కేటాయించే వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను కేంద్రం 70 శాతానికి పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ లేఖ రాశారు.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా 70 శాతం పెంపు

న్యూఢిల్లీ, మార్చి 27: రాష్ట్రాలకు కేటాయించే వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను కేంద్రం 70 శాతానికి పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ లేఖ రాశారు. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా కోటాను మరో 20 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. కీలక రంగాలకు మద్దతునిచ్చే ఉక్కు, అల్యూమినియం, వస్త్రాలు, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్‌ తదితర పరిశ్రమలకు అదనపు సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - Mar 28 , 2026 | 04:30 AM