చమురు కంపెనీలకు రోజుకు 750 కోట్ల నష్టం
ABN , Publish Date - May 19 , 2026 | 04:05 AM
యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు రోజుకు రూ.750 కోట్ల మేర నష్టపోతున్నాయి.
న్యూఢిల్లీ, మే 18: యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు రోజుకు రూ.750 కోట్ల మేర నష్టపోతున్నాయి. కొనుగోలు ధరలు, ఇతర ఖర్చులకు అనుగుణంగా దేశీయంగా రేట్లు పెంచకపోవడమే ఇందుకు కారణమని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు రోజుకు రూ.1000 కోట్ల మేర నష్టాలు వచ్చాయని, ఈ నెల 15వ తేదీన లీటరు పెట్రోలు, డీజిల్‌లపై రూ.3 వంతున పెంచడంతో పావు వంతు మేర నష్టాలు భర్తీ అయ్యాయని వివరించారు.