Share News

సోషల్‌ మీడియా నియంత్రణపై మరిన్ని కేంద్రప్రభుత్వ శాఖలకు అధికారం!

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:32 AM

సోషల్‌ మీడియాలో నకిలీ, వదంతులతో కూడిన పోస్టులను నియంత్రించడం లేదా వాటిని తొలగించేలా ఆదేశాలు ఇచ్చే అధికారాన్ని మరిన్ని మంత్రిత్వ శాఖలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

సోషల్‌ మీడియా నియంత్రణపై మరిన్ని కేంద్రప్రభుత్వ శాఖలకు అధికారం!

న్యూఢిల్లీ, మార్చి 18: సోషల్‌ మీడియాలో నకిలీ, వదంతులతో కూడిన పోస్టులను నియంత్రించడం లేదా వాటిని తొలగించేలా ఆదేశాలు ఇచ్చే అధికారాన్ని మరిన్ని మంత్రిత్వ శాఖలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ చట్టంలోని సెక్షన్‌-69ఏ ప్రకారం పోస్టులను బ్లాక్‌ చేసే అధికారాన్ని కేంద్ర హోం, విదేశాంగ, రక్షణ, సమాచార-ప్రసారాల శాఖకు కూడా కల్పించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా పోస్టుల నియంత్రణ, బ్లాక్‌ చేసేందుకు అవసరమైన తుది మార్గదర్శకాలు ఇచ్చే అధికారం కేంద్ర ఐటీ శాఖకు మాత్రమే ఉంది. ఆర్థిక పరమైన అంశాలపై ఆన్‌లైన్‌లో వస్తున్న వదంతులు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఈ అధికారాలు దోహదపడతాయని భావిస్తున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 06:32 AM