వృద్ధుల కోసం ‘జీవన్’ యాప్ ఆవిష్కరణ
ABN , Publish Date - May 23 , 2026 | 03:57 AM
వయోవృద్ధుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ‘జీవన్’ (జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్‌మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్‌వర్క్) యాప్‌ను కేంద్ర సామాజిక న్యాయం...
న్యూఢిల్లీ, మే 22: వయోవృద్ధుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ‘జీవన్’ (జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్‌మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్‌వర్క్) యాప్‌ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖల మంత్రి వీరేంద్ర కుమార్ శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు. ‘శతాయు’ (సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ) అనే డ్యాష్‌బోర్డును కూడా ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం తరఫున అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్య సదుపాయాలు, అత్యవసర సేవలు, జిల్లాల వారీగా ‘కేర్ గివర్స్’, ప్రభుత్వ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమాలు తదితర వివరాలను వీటిలో పొందుపరిచారు.