హైవేల నిర్మాణానికి నిర్ణీత కాలపరిమితి
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:46 AM
హైవేల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్ణీత సమయాన్ని నిర్ధారిస్తూ సోమవారం కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: హైవేల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్ణీత సమయాన్ని నిర్ధారిస్తూ సోమవారం కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణీత కాలాన్ని ‘బేస్ కన్‌స్ట్రక్షన్ పీరియడ్’గా పేర్కొంది. శాస్త్రీయ అధ్యయనం చేసిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. రూ.300 కోట్లలోపు పనులను 12 నెలలు, రూ.301-500 కోట్ల పనులను 18 నెలలు, రూ.501-1,500 కోట్ల పనులను 24 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికంగా సొరంగాలు, వంతెనలు నిర్మించాల్సి వస్తే గడువును మరో 12 నెలలపాటు పొడిగించనుంది. ఇంతవరకు ఉన్న నిబంధనల ప్రకారం 50 కి.మీ.కన్నా ఎక్కువ పొడవు ఉన్న జాతీయ రహదారి, 200 మీటర్లకన్నా తక్కువ పొడవున్న వంతెనను నిర్మించాల్సి ఉంటే అందుకు 24-30 నెలల సమయం ఇచ్చింది.