Share News

కిల్‌ స్విచ్‌, బీమా!

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:33 AM

దేశంలో డిజిటల్‌ అరెస్టులు, ఆర్థిక మోసాలను కిల్‌ స్విచ్‌, బీమాలతో కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సూచించింది.

కిల్‌ స్విచ్‌, బీమా!

  • డిజిటల్‌ అరెస్టుల కట్టడికి కేంద్ర ‘హోం’ కమిటీ సూచన

ముంబై/న్యూఢిల్లీ, జనవరి 21: దేశంలో డిజిటల్‌ అరెస్టులు, ఆర్థిక మోసాలను కిల్‌ స్విచ్‌, బీమాలతో కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సూచించింది. ఈ రెండు అంశాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. అదేవిధంగా మోసపూరిత లావాదేవీలను గుర్తించడం, వాటి ద్వారా మ్యూల్‌ ఖాతాలకు సొమ్ము బదిలీ కాకుండా నిలుపుదల చేయడం వంటి అంశాలపైనా ఈ కమిటీ దృష్టి సారించింది. డిజిటల్‌ అరెస్టులకు గురయ్యామని గుర్తించిన వెంటనే బాధితులు ‘కిల్‌ స్విచ్‌’ను వినియోగించి వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో ఉన్న తమ అకౌంట్లను నిలుపుదల చేయొచ్చు. తద్వారా వారి అకౌంట్లకు సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిచిపోతాయి. అన్ని యూపీఐ, బ్యాంక్‌ యాప్స్‌లో కిల్‌ స్విచ్‌ ఏర్పాటు చేయనున్నారు. అలాగే డిజిటల్‌ మోసాల కారణంగా బాధితుల సొమ్ము అపహరణకు గురైనప్పటికీ బీమా చేయించండం ద్వారా ఆ సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వాణిజ్య సహా అన్ని బ్యాంకుల్లోనూ ఈ బీమాను తీసుకురావాలని ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదించింది.

Updated Date - Jan 22 , 2026 | 03:33 AM