Share News

కేంద్ర రంగ సంస్థల్లో వేతనాలు, పింఛన్ల పెంపు

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:16 AM

ప్రభుత్వ రంగంలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు, నాబార్డు, రిజర్వ్‌ బ్యాంకు ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు, పింఛను పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసింది.

కేంద్ర రంగ సంస్థల్లో వేతనాలు, పింఛన్ల పెంపు

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వ రంగంలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు, నాబార్డు, రిజర్వ్‌ బ్యాంకు ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు, పింఛను పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసింది. ఈ నిర్ణయంతో సుమారుగా 46,322 మంది ఉద్యోగులు, 46 వేల మంది పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. బీమా ఉద్యోగులకు వేతనాల్లో పెరుగుదల 2022, ఆగస్టు 1 నుంచి అమలుకానున్నది. ఏప్రిల్‌, 2010 తరువాత చేరిన బీమా ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) కంట్రిబ్యూషన్‌ను 10ు నుంచి 14ుకి పెంచింది. నాబార్డు ఉద్యోగులకు జీతము, అలవెన్సుల్లో సుమారు 20ు పెరిగింది. ఈ పెంపు నవంబరు 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ పెంపుదల గ్రూపు ఏ, బీ, సీ ఉద్యోగులకు వర్తిస్తుంది.

Updated Date - Jan 24 , 2026 | 04:16 AM