Share News

పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు కేంద్రం చెక్‌!

ABN , Publish Date - May 25 , 2026 | 04:02 AM

పెట్రోల్‌ బంకుల్లో లేదా గ్యాస్‌ స్టేషన్లలో వాహనాలకు ఇంధనం నింపే సమయంలో, కొలతల్లో మోసాలు జరగకుండా, పారదర్శకతను మరింత ..

పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు కేంద్రం చెక్‌!

  • లీగల్‌ మెట్రాలజీ నిబంధనలకు సవరణ

న్యూఢిల్లీ, మే 24: పెట్రోల్‌ బంకుల్లో లేదా గ్యాస్‌ స్టేషన్లలో వాహనాలకు ఇంధనం నింపే సమయంలో, కొలతల్లో మోసాలు జరగకుండా, పారదర్శకతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. లీగల్‌ మెట్రాలజీ(ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రం)నిబంధనలను-2013 ఆదివారం సవరించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రం(జీఏటీసీ) పరిధిని విస్తరించింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్‌ పంపిణీ యంత్రాల కచ్చితత్వాన్ని తనిఖీ చేసి, ధ్రువీకరించే బాధ్యతను జీఏటీసీలకు అప్పగించింది. జీఏటీసీల ఫ్రేమ్‌వర్క్‌లోకి సీఎన్‌జీ, ఎల్‌ఎల్‌జీ, హైడ్రోజన్‌ పంపిణీ యంత్రాలను కూడా చేర్చింది. తాజా చర్యతో జీఏటీసీలు ధ్రువీకరించే తూనికలు, కొలతల పరికరాల జాబితా సంఖ్య 18 నుంచి 23కు పెరిగింది.

Updated Date - May 25 , 2026 | 04:02 AM