ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:22 AM
ట్రంప్‌పై జరిగిన దాడిని ప్రధాని మోదీ సహా వివిధ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. దాడి నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారనే విషయం ఉపశమనం కలిగించిందని మోదీ అన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ట్రంప్‌పై జరిగిన దాడిని ప్రధాని మోదీ సహా వివిధ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. దాడి నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారనే విషయం ఉపశమనం కలిగించిందని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇది ట్రంప్ ఒక్కరిపై లేక అమెరికాపై మాత్రమే జరిగిన దాడి కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌పై జరిగిన దాడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కూడా తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటన తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, కెనడా ప్రధాని మార్క్ కార్నే, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్, జపాన్ ప్రధాని సనాయె తకాచి, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ కూడా ట్రంప్‌పై దాడిని ఖండించారు.