Haryana: హరియాణాలో మహిళపై గ్యాంగ్‌రేప్
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:54 AM
హరియాణాలోని బహదూర్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ(42)పై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ, జనవరి 16: హరియాణాలోని బహదూర్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ(42)పై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న బస్సును ఫాలో అయి.. తోడుగా ఉన్న బంధువుల నుంచి ఆమెను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ ఉద్యోగం కోసం బాబాయితో కలిసి ఢిల్లీకి వచ్చింది. 12వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకు ఢిల్లీలోని పండిట్ శ్రీరామ్ శర్మ మెట్రోస్టేషన్ వద్ద బస్సు నుంచి దిగింది. అక్కడి నుంచి వారిద్దరినీ తీసుకెళ్లేందుకు ఆమెకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి వచ్చాడు. అప్పటివరకు బస్సును ఫాలో అయిన ఐదుగురు.. మహిళను ఆమె బాబాయి, సోదరుడి నుంచి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు 8గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.