Share News

ఎన్‌ఏసీఎఫ్‌సీ అధ్యక్షుడిగా జీ సాంబశివరావు ఎన్నిక

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:04 AM

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్స్‌ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి.సాంబశివరావు, జాతీయ కార్యదర్శిగా ఎస్‌. పద్మనాభన్‌ ఎన్నికయ్యారు.

ఎన్‌ఏసీఎఫ్‌సీ అధ్యక్షుడిగా జీ సాంబశివరావు ఎన్నిక

చెన్నై, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్స్‌ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి.సాంబశివరావు, జాతీయ కార్యదర్శిగా ఎస్‌. పద్మనాభన్‌ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన అసోసియేషన్‌ 32వ వార్షిక సర్వసభ్య మండలి సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ కోశాధికారిగా కరన్‌ వై తక్కర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్‌. హరిహర సుబ్రమణియన్‌, భరత్‌ రాజే్‌సజోషి, వి. పద్మనాభన్‌, రఘుజయరామ్‌, గణేష్‌ కృష్ణన్‌, అషుతోష్‌ జైస్వాల్‌, జే డేవిడ్‌ రాజా కెప్టెన్‌ నిషిత్‌ జోషి ఎన్నికయ్యారు. వీరితో పాటు 13 మందిని ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఈ కొత్త కార్యవర్గ సభ్యులందరూ రెండేళ్లపాటు తమ పదవులలో కొనసాగుతారని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Oct 03 , 2026 | 05:04 AM