ఇంధన ధరలను తక్షణమే తగ్గించలేం
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:38 AM
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలో ఇంధనం ధరలను తక్షణం తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం..
అది సాధ్యం కాదు: కేంద్ర మంత్రి సురేష్ గోపి
న్యూఢిల్లీ, జూన్ 18: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలో ఇంధనం ధరలను తక్షణం తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ధరలు తగ్గించలేమని అన్నారు. హోర్ముజ్ జలసంధి ద్వారా తక్కువ ధర ముడిచమురు భారత్‌కు చేరేందుకు మరికొంత సమయం తీసుకుంటుందని తెలిపారు. అక్కడ చిక్కుకున్న నౌకలు తొలుత కదలాల్సి ఉంటుందని, ఆ తరువాతే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు.