Share News

మద్యం కొనడానికి డబ్బులివ్వలేదని యువకుడి తలపై సుత్తితో మేకును కొట్టిన స్నేహితులు

ABN , Publish Date - May 18 , 2026 | 02:38 AM

మద్యం కొనేందుకు డబ్బులివ్వలేదని తోటి స్నేహితుడి తలపై సుత్తితో మేకును కొట్టి.. దారుణంగా దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌...

మద్యం కొనడానికి డబ్బులివ్వలేదని యువకుడి తలపై సుత్తితో మేకును కొట్టిన స్నేహితులు

అలీగఢ్‌, మే 17: మద్యం కొనేందుకు డబ్బులివ్వలేదని తోటి స్నేహితుడి తలపై సుత్తితో మేకును కొట్టి.. దారుణంగా దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 15న ఘటన చోటుచోసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాపూర్‌ కుతుబ్‌ గ్రామానికి చెందిన యువకుల మధ్య మద్యం కొనేందుకు డబ్బుల విషయమై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే డబ్బులివ్వలేదన్న కోపంతో ఓ యువకుడిపై దాడి చేసిన మిగతా స్నేహితులు.. అతడి తలపై సుత్తితో మేకును కొట్టారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - May 18 , 2026 | 02:38 AM