ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉచితంగా 3 టికెట్లు
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:50 AM
ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు కర్ణాటక ఎమ్మెల్యేలకు మూడు టికెట్‌లు ఉచితంగా ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్...
కర్ణాటక ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్
బెంగళూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు కర్ణాటక ఎమ్మెల్యేలకు మూడు టికెట్‌లు ఉచితంగా ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ, డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజిమెంట్ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఒక్కో ఎమ్మెల్యేకు ఐపీఎల్ మ్యాచ్‌లకు 3టికెట్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు 2 టికెట్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. తాము వీఐపీలమని, క్యూలో నిలబడి ఐపీఎల్ టికెట్‌లు కొనుగోలు చేయలేమని శాసనసభలో ఎమ్మెల్యేలు గతవారం ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత అశోక్ కూడా ఇదే డిమాండ్ చేశారు.