Share News

ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం ఖండూరి కన్నుమూత

ABN , Publish Date - May 20 , 2026 | 02:30 AM

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత భువన్‌ చంద్ర ఖండూరి(91) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, డెహ్రాడూన్‌లోని ఓ...

ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం ఖండూరి కన్నుమూత

డెహ్రాడూన్‌, మే 19: ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత భువన్‌ చంద్ర ఖండూరి(91) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లోకి రాకముందు బీసీ ఖండూరి భారత సైన్యంలో మేజర్‌ జనరల్‌గా దేశానికి సేవలందించారు. ఆర్మీ నుంచి పదివీ విరమణ పొందాక ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. బీసీ ఖండూరి ఉత్తరాఖండ్‌కు రెండుసార్లు సీఎంగా సేవలు అందించారు. 2007లో ఆయన తొలిసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాల్లోనూ బీజేపీ ఓటమి చవిచూడడంతో, ఆ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం ఆయనపై నమ్మకంతో 2011లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగానూ పనిచేశారు.

Updated Date - May 20 , 2026 | 02:30 AM